-వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ప్రచారం!
-అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా
-మంగళగిరి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో నారా లోకేష్
మంగళగిరి: వైసిపి నాయకులకు తెలిసింది రౌడీయిజం, దుష్ర్పచారం మాత్రమే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటుచేసుకోవాలని యువనేత నారా లోకేష్ విజ్ఞప్తిచేశారు. మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం చుక్కపల్లివారిపాలెం, చినపాలెం, శృంగారపురం గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ సభల్లో యువనేత పాల్గొన్నారు.
రచ్చబండ కార్యక్రమానికి ముందు తాడిబోయినవారిపాలెంలో శ్రీకృష్ణ మందిరం, గంగమ్మతల్లి ఆలయాలను సందర్శించారు. తర్వాత చుక్కపల్లివారిపాలెంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి, చర్చిలో ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం రచ్చబండ సభలో లోకేష్ మాట్లాడుతూ… తాను శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాక అయిదేళ్లూ అహర్నిశలు కష్టపడి మంగళగిరి రూపురేఖలు మారుస్తా, ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటా, సమస్యల పరిష్కారం కోసం ప్రజలు నా వద్ద రావాల్సిన పనిలేదు, నేను ప్రజలచుట్టూ తిరిగి సేవలందిస్తా.
చంద్రబాబు, పవనన్న పోరాడి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తా. గత ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక నాలో కసి పెరిగింది. మంగళగిరి ప్రజల మనసు గెలవాలని నిర్ణయించుకున్నా. సొంత డబ్బుతో 29 సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేశా. పాతికేళ్లు ప్రాతినిధ్యం వహించిన వారు కనీసం సిమెంటు బల్ల అయినా ఏర్పాటుచేశారా? నేను చేసిన సంక్షేమంలో పదోవంతైనా చేయగలిగారా?
మంగళగిరి నా సొంతమనుకొని సేవ చేస్తున్నా. ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే రెట్టింపు కష్టపడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మంగళగిరిలో పేదరికం లేకుండా చూడాలన్నదే నా లక్ష్యం. అహర్నిశలు శ్రమించి దేశం మొత్తమ్మీద అభివృద్ధి, సంక్షేమాలకు చిరునామా గా మంగళగిరిని మారుస్తా. మీలో ఒకడిగా ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో నన్ను అసెంబ్లీకి పంపండి. అభివృద్ధి అంటే ఎలా మంగళగిరి అనేలా చేసి చూపిస్తా.
వాలంటీర్లతో ఇళ్లవద్దకే రూ.4వేల పెన్షన్ ఇస్తాం
జగన్ కు శవరాజకీయాలంటే ఇష్టం, 2014లో తండ్రి శవం, 2019తో బాబాయి శవంతో రాజకీయ లబ్ధిపొందారు. ఇప్పుడు పెన్షన్లు ఇవ్వకుండా 32మంది అమాయక వృద్ధులను చంపి వారితో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఒక్కనెల ఓపిక పట్టండి. 3వేల పెన్షన్ ను 4వేలకు పెంచి వాలంటీర్లతో ఇళ్లవద్దే అందజేస్తాం. జగన్ పాలనలో అడ్డగోలుగా పన్నుల భారం మోపడంతో ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారంలోకి వచ్చాక ఆటోడ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేసి సబ్సిడీ రుణాలను అందజేస్తాం.
చీటికిమాటికీ ఫైన్లు, పోలీసుల వేధింపులకు స్వస్తి పలుకుతాం. వారి ఆదాయాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటాం. ఆటోడ్రైవర్లకు అన్నివిధాలా అండగా నిలుస్తాం. ముఖ్యమంత్రి జగన్ కు దళితులంటే చిన్నచూపు. దళితులకు గత ప్రభుత్వం అమలుచేసిన అంబేద్కర్ విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, ఫీజు రీఎంబర్స్ మెంట్ వంటి 27 సంక్షేమ పథకాలను జగన్ కట్ చేశారు.
అధికారంలోకి వచ్చాక ఎస్సీలకు గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరిస్తాం. గత అయిదేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఒక్కలోన్ కూడా ఇవ్వలేదు. వైసిపి ప్రభుత్వం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను ఎమ్మెల్యే అనంతబాబు హత్యచేసి డోర్ డెలివరీచేస్తే, ఆయనను వెంటబెటుకుని జగన్ ప్రచారం చేస్తున్నారు. జగన్ అరాచకాలపై దళితులంతా ఆలోచించాలి.
యువనేత దృష్టికి చుక్కపల్లివారిపాలెం సమస్యలు
రచ్చబండ సందర్భంగా చుక్కపల్లివారిపాలెం గ్రామస్తులు తమ సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. జగన్ ప్రభుత్వం కొర్రీలవేసి పేదబిడ్డలకు విదేశీవిద్య పథకాన్ని దూరం చేస్తోంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ సరిగా జమచేయకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బంది పెడుతున్నాయి. కౌలురైతులకు సాయం, సబ్సిడీలు అందించాలి. చర్చి నిర్మాణానికి నిధులు కేటాయించాలి. గ్రామంలో ఆటస్థలం ఏర్పాటుచేయాలి. డ్రైన్లలో పూడికతీయకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు.
యువనేత లోకేష్ స్పందిస్తూ… జగన్ ప్రభుత్వ నిర్వాకం కారణంగా 6లక్షలమంది విద్యార్థుల సర్టిఫికెట్లు కళాశాలల్లో ఉండిపోయాయి. వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా విద్యార్థులకు అందిస్తాం. ఫీజులను నేరుగా కాలేజిలకే చెల్లించేలా పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ విధానాన్ని తెచ్చి విద్యార్థులు ఇబ్బందులను తొలగిస్తాం. కౌలురైతు చట్టాన్ని పకడ్బందీగా అమలుచేసి సాయం, సబ్సిడీలు అందజేస్తాం. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచుతాం. మంగళగిరిలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుచేసి మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధరల లభించేలా చర్యలు తీసుకుంటాం. భూగర్భ డ్రైనేజి, తాగునీటి సౌకర్యం కల్పిస్తాం. గ్రామంలో ఆటస్థలం, చర్చిలకు నిధులు అందించేలా చర్యలు తీసుకుంటామని లోకేష్ హామీ ఇచ్చారు.
లోకేష్ ఎదుట చినపాలెం వాసుల సమస్యలు
చినపాలెంలో రచ్చబండ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. చినపాలెం నుంచి మహంకాళి అమ్మవారి ఆలయం వరకు రోడ్డునిర్మాణం చేపట్టాలి. గత ప్రభుత్వంలో ఆదరణ పథకం కోసం వాటా చెల్లించాం, వైసిపి ప్రభుత్వం వచ్చాక పనిముట్లు అందించలేదు. బిసి కాలనీ, ఎస్సీ కాలనీల్లో రోడ్లు, కల్వర్టులు నిర్మించాలి. శ్మశానానికి స్థలం కేటాయించాలి. గ్రామానికి బస్ సౌకర్యం కల్పించాలి. గ్రామ పొలాలకు నీరందించే కాల్వకు లాకులు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని చెప్పారు.
నారా లోకేష్ స్పందిస్తూ… మహంకాళి అమ్మవారి గుడివరకు రోడ్డు నిర్మిస్తాం. ఆదరణ పథకాన్ని పునరుద్దరించి పనిముట్లు అందజేస్తాం. బిసి, ఎస్సీ కాలనీలకు రోడ్లు నిర్మిస్తాం. గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తా, భూసేకరణ చేసి శ్మశానవాటికకు స్థలం కేటాయిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. 3132 కి.మీ.ల పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నా. అధికారంలోకి వచ్చాక సూపర్ -6 హామీలను అమలుచేసి పేదలకు అండగా నిలుస్తాం. ఎంపి అభ్యర్థి పెమ్మసాని, ఎమ్మెల్యేగా తనకు అవకాశమిస్తే డబుల్ ఇంజన్ మాదిరిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని లోకేష్ పేర్కొన్నారు