-ఇది మోదీ ఎన్నిక
-బీజేపీ 12 సీట్లు గెలవబోతుంది
-హస్తినాపురం డివిజన్ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో -పాల్గొన్న ఈటల రాజేందర్, సామ రంగారెడ్డి
12 సీట్లు బీజేపీ గెలవబోతుంది.ఇది మోదీ ఎన్నిక. ప్రజల అంతరంగం అర్థం చేసుకునే జ్ఞానం కేసీఆర్, రేవంత్ ఇద్దరికీ లేదు. అక్షింతలు పంపితే ఓట్లు పడతాయా అని కేసీఆర్అం టున్నారు.. ఎట్లా పడతాయో మీరే చూడండి. ఎమ్మెల్యే ఎన్నికల్లో 37 శాతం ఉన్న ఓటు బ్యాంక్ ఇప్పుడు 17 శాతం కావడంతో ఎటు పోయింది మా ఓటు బ్యాంక్ అని అసహనంతో కేసీఆర్ మాట్లాడుతున్నారు.
కాంగ్రెస్ నాయకులది నాలుకనా.. తాటిమట్టనా.. నరం ఉందా లేదా.. ఒక స్థాయిలో ఉండి మాట్లాడితే ప్రజలు అసహ్యుంచుకుంటారు అనే సోయిలేదు. మానవబాంబులు అయి పేలేది టెర్రరిస్టులు.. ముఖ్యమంత్రులు కాదు. పేగులు మెడలో వేసుకొనేది గుండాలు.. సిఎంలు కాదు. రిజర్వేషన్లు బీజేపీ రద్దు చేస్తుంది అని చెప్తున్నారు.. ఒక పార్టీమీద ఆరోపణ చేసేటప్పుడు ఒక్క శాతం అన్నా నిజం ఉండాలి కదా.
కాంగ్రెస్ చరిత్రలో మంత్రుల కూర్పులో ఏనాడన్నా సామాజిక న్యాయం పాటించారా ? కుటుంబ కబ్జాలో.. వారి పదగట్టాల కింద నలిగి పోయింది. మీ క్యాబినెట్ లో ఎంతమంది బీసీలు ఉన్నారు చెప్పండి. మీరు మాట్లాడితే మళ్ళీ ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారా? డబ్బులు వసూలు చేసి.. పెయిడ్ ఆర్టికల్స్ రాయించి ప్రజలను నమ్మించి గెలిచారు.
మీకు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయం. అతుకుల బొంత సంసారం దేశం చూసింది. మళ్ళీ అది కావాలని కోరుకోవడం లేదు. మోదీకి ఒక విజన్ ఉంది. సుస్థిర, సుసంపన్న, శాంతియుత భారత దేశంకోసం బీజేపీకి ఓటు వేయాలని విజప్తి చేస్తున్నా.