రైతుబంధు మంజూరైనా కావాలనే ఆపారు…

డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క

చౌటుప్పల్‌, మహానాడు : రాష్ట్రంలోని రైతాంగ సోదరులకు అమలులో ఉన్న రైతు బీమా, రైతుబంధు పథకం కింద రూ.7624 కోట్లు మంజూరు చేశాం. కొంతమంది సీఎంపై ఫిర్యాదులతో అవి నిలిచిపోయాయని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. చౌటుప్పల్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు. బీజేపీ వ్యాపారుల పార్టీ…ఓటు వేస్తే వృధా అవుతుందని పేర్కొన్నారు. భువనగిరి లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌కు కంచుకోట. సేవాభావం కలిగిన చామల కిరణ్‌కుమార్‌ రెడ్డిని గెలిపించాలని కోరారు.