ఎల్లవేళలా అందుబాటులో ఉంటా
దర్శి టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి
దర్శి: ఎన్నికలు ముగిశాక తొలిసారిగా దర్శికి వచ్చిన టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ప్రజానీకం అపూర్వ స్వాగతం పలికారు. ఆమె నివాసం దగ్గర మధ్యా హ్నం నుంచే కోలాహలం నెలకొంది. తరలివచ్చిన ప్రజానీకం మాట్లాడుతూ మా బిడ్డగా ఆదరిస్తాం.. నియోజకవర్గంలోనే ఉండి చంద్రబాబు నాయకత్వంలో దర్శి అభివృద్ధికి పాటుపడండి…మేము ముందుండి నడిపిస్తామని లక్ష్మికి మాటిచ్చా రు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ మీరు ధైర్యంగా ఉండాలని, మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మనం ప్రజల్లో గెలిచాం.. నియోజకవర్గంలో దాదాపు లక్ష మంది ఓట్లు వేసి ఆదరించారు. మీ అభిమానా న్ని మర్చిపోను. దర్శి అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని పోలీస్, రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు ఆమెను కలిసేందుకు వచ్చారు.