– ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్
పెదకూరపాడు, మహానాడు: స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐదు మండలాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మాట్లాడుతూ రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ తమ ఓట్లు నమోదు చేసుకునేలా నాయకులు పనిచేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకునేలా కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి నాయకుల పూర్తి సహకారాన్ని అందించాలని ఎమ్మెల్యే కోరారు.