ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రయోజనం

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు

వినుకొండ: సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి ఏదొక ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ డిపోలో ఆదివారం నాలుగు కొత్త బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు.

వినుకొండ, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని, రాష్ట్రంలో ఆర్టీసీ, రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలిపారు. వినుకొండ నుంచి గుంటూరుకు గంటలో చేరే రహదారుల అభివృద్ధి, వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కి.మీ. హైవేను నాలుగు వరుసలుగా విస్తరణ జరుగనుందని తెలిపారు. అలాగే, వినుకొండ నుంచి గుంటూరు వరకు 90 కి.మీ. రహదారి నిర్మాణానికి రూ.2,360 కోట్లు కేటాయింపు అయినట్టు చెప్పారు.