-దొంగ ఆస్తులను వాటాలు పంచుకున్న పోలీస్ అధికారులు
-వెంకన్న కొలువులో వెలగ పెట్టిన అధర్మం
– బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సామంచి శ్రీనివాస్
గత ఐదేళ్ల వైసిపి పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానం ధార్మిక సంస్థ లో జరిగిన అక్రమాలు, అధర్మాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అక్రమార్కుల పాపం పండిపోవడంతో సాక్షాత్తు తిరుమల వెంకన్న ఈ అక్రమాలను ఇలా వెలుగులోకి తెస్తున్నారని భావిస్తున్నారు.
తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు ఎంతో భక్తితో వేసిన కోట్లాది రూపాయల విదేశీ కరెన్సీ నోట్ల కానుకలు దొంగతనానికి గురై వాటిని ఆస్తుల రూపంలో కూడబెట్టుకున్న ఒక నేరస్తుడి నుండి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా ఆ దొంగతోనే కుమ్ముక్కై సంస్థ పరువు పోతుందనే సాకుతో అతని ఆస్తులను టీటీడీకి విరాళంగా కొంత ఇప్పించి, మరికొంత దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్న విధంగా అప్పట్లో ఈవో గా పని చేసిన ఆధర్మాధికారి, ఎస్పీ స్థాయిలో పనిచేసిన పోలీస్ అధికారి, సీఐ స్థాయి పోలీస్ అధికారులు కొన్ని ఆస్తులను నేరస్తుడి నుండి తమకు మళ్ళించుకోవడం చూస్తుంటే ఇలాంటి క్రిమినల్స్ ను ఏమనాలో.?.. తిరుమలేశుడు ఇంతకాలం ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నాడో కూడా అర్థం కావడం లేదు.
శాసనమండలి లో సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఈ అంశంపై సభలో వివరణ ఇస్తూ, సంఘటనలోని పూర్వపరాలను విచారించి, తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసిన విదేశీ కరెన్సీ నోట్లు కానుకలు పరకామణిలో లెక్కింపు కార్యక్రమంలో దొంగతనానికి పాల్పడిన పెద్ద జీయర్ మఠానికి సంబంధించిన రవికుమార్ అనే వ్యక్తి పైన, ఈ సంఘటనను పక్కదారి పట్టించిన అప్పటి ఈవో అధర్మారెడ్డి పైన, అప్పటి ఎస్పీ, సిఐలపైన, అవినీతికి అక్రమాలకు పాల్పడిన అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ప్రకటించడంతో ఈ అంశం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఇంతకాలం ఈ సంఘటనను బయట ప్రపంచానికి తెలియకుండా ఎందుకు తొక్కి పెట్టారో కూడా అప్పటి పాలకమండలి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా మంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం.
తిరుమల కొండపై సంచలనం కలిగించిన ఈ కుంభకోణం అధర్మ పాపపు కార్యక్రమాల వెనుక వివరాలను ఒకసారి పరిశీలిస్తే……. తిరుమల శ్రీవారి హుండీలో భక్తులు వేసే కానుకల ద్వారా ప్రతినిత్యం నాలుగు కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. శ్రీవారి ఆలయ వ్యవహారాల సాంప్రదాయాలను పర్యవేక్షించే ఆలయ పెద్దగా పెద్ద జీయర్ స్వామి వ్యవహరిస్తుంటారు.
ఆయన వద్ద శిష్యరికం చేస్తున్న రవికుమార్ అనే వ్యక్తి గత 20 ఏళ్లుగా తిరుమల శ్రీవారి ఆలయంలో పరకామణిలో హుండి కానుకలను లెక్కిస్తుంటారు. ఆలయ సాంప్రదాయాల ప్రకారం పెద్ద జీయర్ స్వామీజీ కి చెందిన వారిని ఆలయం లోపలికి వెలుపలికి వచ్చే సమయంలో పెద్దగా తనిఖీ చేయడం జరగదు. కానీ ఓ రోజు అనుకోకుండా టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పరకామణికి వెళ్లి వస్తున్న రవికుమార్ ను ఆకస్మికంగా వెలుపలికి వెళుతుండగా తనిఖీ చేశారు.
దీంతో ఆయన వద్ద అనూహ్యంగా మలమూత్ర విసర్జన ప్రదేశంలో దాచి ఉంచుకొని దొంగతనంగా తీసుకెళ్తున్న విదేశీ యూఎస్ డాలర్లు భారీ ఎత్తున బయటపడ్డాయి.
ఆశ్చర్యపోయిన టిటిడి విజిలెన్స్ అధికారులు మొత్తం కూపీ లాగారు. ఇంతకాలం రవికుమార్ ను తనిఖీ చేయకపోవడం ఎంత పెద్ద తప్పిదమో తెలుసుకుని ఆలోచనలో పడ్డారు. గత 20 ఏళ్లుగా పరకామణిలో కానుకలను లెక్కింపు చేస్తున్న రవికుమార్ ప్రతిరోజు ఇలా మలమూత్ర విసర్జన ప్రాంతంలో సీసీ కెమెరాలకు ఒక సైతం దొరకకుండా యూఎస్ డాలర్లు, విదేశీ కరెన్సీ మాత్రమే దొంగతనంగా తీసుకెళ్తుండేవాడు.
మలమూత్ర విసర్జన ప్రాంతంలో ఇలా విదేశీ కరెన్సీని దొంగతనం చేసేందుకు కోసమే చెన్నైలో ఒక ఆసుపత్రిలో మలమూత్ర విసర్జన ప్రాంతంలో విదేశీ కరెన్సీని దాచి ఉంచేందుకు ప్రత్యేకంగా సర్జరీ చేసి ఏర్పాట్లు కూడా చేసుకున్నారని తెలిస్తే మరింత ఆశ్చర్యం కలిగించక మానదు.
కానీ ఇది వాస్తవం అని తేలింది. ఇలా విదేశీ కరెన్సీ ని యదేచ్చగా అందరి కళ్ళు కప్పి దొంగతనం చేస్తూ రవికుమార్ దాదాపు 150 కోట్లకు పైగా విలువచేసే ఆస్తులు అపార్ట్మెంట్లు, ప్లాట్లు, స్థలాలు, ఆభరణాలు, తదితర ఆస్తులు, కూడబెట్టుకున్నట్లు విచారణలో వెల్లడైంది.
జూలై 2022లో బయటపడిన ఈ అక్రమ వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా నొక్కి పెట్టేందుకు అప్పటి ఈవో, ఎస్పీ, తిరుమలలో పనిచేసే ఒక సీఐ రంగంలోకి దిగారు. వ్యవహారం బయటకు పడకుండా కొంతకాలం నొక్కి పెట్టారు.
శ్రీవారి సొమ్మును నొక్కేసిన నిందితుడు రవికుమార్ వద్దనుండి ఆస్తులను జప్తు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకొని అతనికి శిక్షపడేలా చేసి దేవుడికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన అధికారులు టీటీడీ సంస్థ పరువు బజారున పడుతుందని చిన్న సాకు చూపించి తెర వెనుక భారీ ఎత్తున అక్రమాలకు తెగబడ్డారు.
అతని ఆస్తులు అన్ని లెక్క కట్టారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వయంగా నిందితుడు రవికుమార్ విరాళంగా ఇస్తున్నట్లుగా సృష్టించి కొన్ని ఆస్తులను టిటిడి సంస్థ పేరిట రాయించారు. నిందితుడు రవికుమార్ పేరిట ఉన్న మరికొన్ని ఆస్తులను పోలీస్ అధికారులు తమ బంధువుల పేరిట రాయించుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఇదే విషయాన్ని అప్పట్లో నిందితుడు రవికుమార్ కూడా పోలీసులు తమను విచారణ పేరిట వేధిస్తున్నారని ఆరోపణలు చేయడం గమనార్హం. కానీ ఈ విషయాన్ని నిందితుడి ఆరోపణలుగా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
కానీ తెర వెనుక సూత్రధారులు మాత్రం నిందితుడైన రవికుమార్ ను అన్ని విధాల పీల్చి పిప్పి చేశారు. ఇంత పెద్ద సంఘటనపై మళ్లీ భవిష్యత్తులో సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందనే దూర ఆలోచనతో రవి కుమార్ పై తేలికపాటి చిన్న పెట్టీ కేసు పెట్టారు. ఆ కేసును కూడా లోక్ అదాలత్ ద్వారా రాజీమార్గంలో పరిష్కరించేశారు.
రవికుమార్ కు చెందిన ఆస్తులను టిటిడి పేరిట రాయించుకున్న సందర్భంలో మాత్రం ఆయన ఆస్తులు టీటీడీకి విరాళం ఇస్తున్నట్లుగా పాలకమండలిలో ఒక తీర్మానం కూడా ఆమోదించారు. అయితే ఈ తీర్మానాన్ని మీడియాకు వెల్లడించకుండా రహస్యంగా అలాగే ఉంచేశారు. దొంగతనం చేసిన దొంగను కాపాడేందుకు తాము దొంగలుగా మారి దొంగకు చెందిన ఆస్తులు పంచుకుని తప్పుల మీద తప్పులు చేసిన అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సాక్షాధారాలతో సహా ప్రభుత్వానికి ఇప్పుడు దొరికిపోయారు.
ఎస్సీ వర్గీకరరణకు సర్వోన్నత న్యాయంఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. బిజెపి వర్గీకరణ కోసం బిజెపి చాలా సంవత్సరాలుగా పోరాడుతున్న విషయం వివరించారు.