పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి సిమి గరేవాల్ సంతాపం తెలిపారు.. ‘ఇక నువ్వు లేవని అంటున్నారు. ఇది భరించలేనిది. వీడ్కోలు నేస్తమా’ అని ఆమె ట్వీట్ చేశారు. రతన్ టాటాతో తాను డేటింగ్ చేశానని, ఆ తర్వాత ఇద్దరం విడిపోయినట్లు 2011లో హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో సిమి చెప్పారు. ఓ ఇంగ్లిష్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె తర్వాత బాలీవుడ్, బెంగాలీలో పలు చిత్రాల్లో నటించారు.