మాజీ మంత్రి తలసాని సోదరుడి మృతి

హరీష్‌రావు, ఎర్రబెల్లి నివాళి

హైదరాబాద్‌: మోండా మార్కెట్‌ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సోదరుడు తలసాని శంకర్‌ యాదవ్‌ అనారోగ్యంతో చికిత్సపొందుతూ సోమవారం తెల్లవారుజామున సికింద్రాబాద్‌ యశోద హాస్పిటల్‌ లో మృతిచెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. బోయిన్‌పల్లి మార్కెట్‌ అధ్యక్షుడిగా శంకర్‌ యాదవ్‌ అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరా లని భగవంతుడిని ప్రార్థించారు.