గడ్చిరోలిలో పేలుడు పదార్థాలు స్వాధీనం

మహారాష్ట్ర: గడ్చిరోలిలోని టిపగడ్‌ ప్రాంతంలో సోమవారం భద్రతా దళాలకు అందిన సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలు, క్లైమోర్‌మైన్‌ల కోసం వెతకడానికి సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పేలుడు పదార్థాలు, డిటోనేటర్లతో నిండిన ఆరు ప్రెజర్‌ కుక్కర్లు, ష్రాప్‌ నెల్స్‌తో నిండిన మూడు క్లైమోర్‌ పైపులను కూడా కనుగొన్నారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా అలజడి సృష్టించేందుకు మావోయిస్టు లు వాటిని అమర్చి ఉంటారని భావిస్తున్నారు.