Mahanaadu-Logo-PNG-Large

నీరబ్‌కు మరో 6 నెలల పదవీకాలం పొడిగింపు

– కేంద్రం ఉత్తర్వులు

అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం మరో 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ గు రు వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన పదవీకాలం మరో 6 నెలలు పొడిగించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవలే కేంద్రానికి లేఖ రాశారు.