చెరగని సిరాపై తప్పుడు ప్రచారం

-అది ప్రభుత్వమే తయారుచేస్తుంది..బయట లభించదు
-ఇతర సిరాలతో ఓటర్ల వేళ్లపై మార్కు చేస్తే కఠిన చర్యలు
-రాష్ట్ర ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా

అమరావతి: చెరగని సిరా ద్వారా ఓటర్ల వేళ్లపై వారి ఇంటి వద్దే మార్కు చేస్తూ ఓటుహక్కును వినియోగించుకోకుండా చూడాలని రాష్ట్రంలో కుట్ర జరుగుతున్నదంటూ సోషల్‌ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా ఖండిరచారు. చెరగని సిరా ప్రభుత్వం మాత్రమే తయారు చేస్తుందని, ఈ సిరా భారత ఎన్నికల సంఘం వద్ద మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. ఇతరులు మరెవరికీ ఇది అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు. ఇది తప్పుడు ప్రచారం మాత్రమేనని ఖండిరచారు. ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.