-వడ్లు తడుస్తున్నాయి..కొనాలని గోడు
-భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా
భువనగిరి: వడ్లు తడుస్తున్నాయి..దయచేసి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కొనాలని భువనగిరి జిల్లా భువనగిరి మండలం ఆకుతోటబావితండా గిరిజన రైతులు బుధవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు తడిసిన ధాన్యం బస్తాలతో వచ్చి కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. ధర్నా చేస్తున్న రైతుల వద్దకు పోలీసులు రాగానే వారి కాళ్లు మొక్కుతూ తమ సమస్యను వివరించారు. వడ్లు తడిసిపోతున్నాయని తెలిపారు.