సాగునీటి విషయంలో రైతులు ఇబ్బంది  పడకూడదు 

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 

అవనిగడ్డ , మహానాడు : రైతాంగం సాగునీటి విషయంలో ఎక్కడా ఇబ్బందులు పడకూడదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. ప్రధాన కాలువలో గుర్రపు డెక్క తొలగింపు పనులను ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జనసేన నేతలు పరిశీలించారు.

అవనిగడ్డ – కోడూరు ప్రధాన పంట కాలువలో గుర్రపు డెక్క తొలగింపు కార్యక్రమాన్ని కోడూరు మండల జనసేన పార్టీ నేతలు పరిశీలించారు. ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చొరవతో కోడూరు మండల వ్యాప్తంగా ఉన్న కాలవల్లో, డ్రైనేజీలో  గుర్రపు డెక్క, పూడికతీత పనులను సంబంధిత శాఖ అధికారులు  వేగంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కు కోడూరు మండల రైతాంగం తరపున ధన్యవాదాలు తెలిపారు.

జనసేన పార్టీ మండల అధ్యక్షులు మర్రే గంగయ్య, కోడూరు టౌన్ పార్టీ అధ్యక్షులు కోట రాంబాబు, పూతబోయిన కరుణకుమార్, పూతబోయన సాయిబాబు, మాజీ డిసి వైస్ చైర్మన్ కాగిత రామారావు, చందు రామాంజనేయులు కోట సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.