ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాలి

– డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి

తాళ్ళూరు, మహానాడు: రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని, పురుగుమందులు అధికంగా వాడకూడదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి సూచించారు. అన్నదాత కు మేలు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఇందులో భాగంగానే పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోందని తెలిపారు. తాళ్లూరు మండలంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ప్రజారోగ్యం, భవిష్యత్ తరాల కోసం క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించాలని కోరారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయం కోసం అనేకమైన అధునాతన యంత్ర పరికరాలను సబ్సిడీపై పంపిణ చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారన్నారు.

గత వైసీపీ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై యంత్రాలకు కూడా నిధులు ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెట్టిందని, రైతు భరోసా కేంద్రాలు వైసీపీ నాయకులకు ఆవాస కేంద్రాలుగా, దోపిడీ కేంద్రాలుగా మారారని డాక్టర్ లక్ష్మి విమర్శించారు. ప్రకృతి కరుణించి ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు పడ్డాయి…. డ్యాములు కూడా నిండాయి…. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రైతులకు పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాలన సాగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో తాళ్లూరు మండల ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబుల్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.