Mahanaadu-Logo-PNG-Large

సజ్జల మాటల్లో ఓటమి భయం

-కుట్రలకు కేరాఫ్‌ తాడేపల్లి ప్యాలెస్‌
-పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర

పొన్నూరు, మహానాడు: ఓడిపోతున్నామనే భయం, నిరాశ, నిస్పృహ సజ్జల రామకృష్ణారెడ్డి మాటల్లో కనబడిరదని పొన్నూరు టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. దాడులు చేసేది మీరే.. చేయించేది మీరే..ప్రేరేపించేది మీరే. కానీ, నిందలు మాత్రం ప్రతిపక్షాల మీద మోపు తుంటారు. కుట్రలు కుతంత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌ తాడేపల్లి ప్యాలెస్‌ అయితే దానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి అని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేకతను తట్టుకోలేక దాడులు మొదలుపెట్టారు. ఈవీఎంలను పగులకొట్టి హింసను ప్రేరేపించారు. అందుకు కొమ్ము కాసింది బులుగు ఖాకీలే. ఇన్ని దౌర్జన్యాలు చేసి ఆ నిందను ఈసీ పై మోపటమా? ఏమైనా అర్థం ఉందా సజ్జల రామకృష్ణారెడ్డి? నీ కల్లబొల్లి మాటలను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. మీ భవిష్యత్తును మే 13నే ప్రజలు రాసేశారు. జగన్‌ రెడ్డి లండన్‌కు పారిపోతున్నాడు. మరి సజ్జలరెడ్డి ఎక్కడికి పారిపోతున్నాడు అనేదే ప్రజల సందేహం. ఇందుకు సమాధానం నీ దగ్గర ఉంటే మరోసారి ప్రెస్‌మీట్‌ పెట్టు. జూన్‌ 4 తర్వాత వైసీపీ గూండాలు ఇక మాయమవడం ఖాయమని స్పష్టం చేశారు.