40 నుంచి 50 శాతం వరకు భారం
కొన్నింటిలో 25 శాతం వరకు పెంపు
నియంత్రణపై ప్రభుత్వ చర్యలు శూన్యం
హైదరాబాద్: ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రు లకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతు న్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు 40-50 శాతం వరకు భారం మోపుతున్నాయి. ఇప్పటికే చాలా పాఠశాలలు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు సమాచారం అందిస్తున్నారు. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యం లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరు తున్నారు.