సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారు
టీడీపీ నేత సి.రామచంద్రయ్య
కడప, మహానాడు : టీడీపీ నాయకుడు సి.రామచంద్రయ్య ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ మేనిఫెస్టోపై స్పందించారు. మేనిఫెస్టోతో ప్రజలను ఫూల్స్ చేస్తున్నారు. దశ, దిశ లేని మేనిఫె స్టోలో కొత్త హామీలు ఏమీలేవు. ఓటమికి చివరి మెట్టు ఈ మేనిపెస్టో అని వ్యాఖ్యానించారు. అస్పష్టమైన మేనిపెస్టో..తుమ్మడం తధాస్తు అన్నట్లుందని పేర్కొన్నారు. సొంత పార్టీ నేతలే దీనిని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ప్రజలను ఆకట్టుకునే మేనిఫెస్టో ప్రకటిస్తారని ఆశించారు. వారిని పూర్తిగా నిరాశపరిచారన్నారు. రాష్ట్ర గణాంకాలు సరిగా లేవు. సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇవ్వడం లేదు. ఇరిగేషన్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు.
జగన్‌కు ఓటమి తథ్యమన్నారు. ప్రజల ఆస్తులను కొల్లగొట్టారు. వైసీపీ నేతలే దోచుకుంటుంటే రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది. మద్యం ద్వారా వచ్చే డబ్బులు వైసీపీ నేతల ఖాతాలోకి వెళుతోంది. వాళ్ల జేబులు నిండితే చాలన్న భావన ఉంది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు సైతం జగన్ అనుయా యుల చేతుల్లోకి వెళుతున్నాయని ఆరోపించారు.