ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం

– చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సత్యానందరావు

ఆత్రేయపురం, మహానాడు: ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న ఆత్రేయపురం మండలం మెర్లపాలెం గ్రామానికి చెందిన మెర్ల చంద్రావతికి 40 వేల రూపాయల చెక్కును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అందజేశారు. గతంలో ప్రమాదవశాత్తూ గాయపడి వైద్యం చేయించుకున్న ఖర్చులు తిరిగి రావడంతో చంద్రావతి ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సత్యానందరావుకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గానికి సంబంధించి దరఖాస్తు చేసిన వాటిలో మొదటిగా వచ్చిన చెక్కును చంద్రావతికి అందించామని, పేదలను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందని సత్యానందరావు అన్నారు. ఈ కార్యక్రమంలోగ్రామ సర్పంచ్ మెర్ల రాము, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) గ్రామ అధ్యక్షుడు మల్లవరపు నాగరాజు, మెర్ల లక్ష్మీపతి, గుండుబోగుల రామకృష్ణ, కొమ్మర వీర రాఘవులు, మెర్ల అప్పన్న, మెర్ల సూరిబాబు, మెర్ల వెంకటేశ్వరరావు, మెర్ల అప్పన్న సూర్యరావు, మెర్ల వెంకటేశ్వర్లు, డేగల సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.