జగన్‌ ప్రభుత్వంలో అవినీతితో ఆర్థిక లోటు

అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశాడు
విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమ

విజయవాడ, మహానాడు : జగన్‌ ప్రభుత్వంలో ఆర్థిక లోటు పెరిగిపోయిందని, రాష్ట్రం అంతా అవినీతి మయం అయింద ని విజయవాడ సెంట్రల్‌ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. వారి అవినీతితో ఎవరూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావటం లేదన్నారు. స్మార్ట్‌ మీటర్ల పేరు మీద కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుక మాఫియా, మద్యంలో లూఠీ చేశారు. డబ్బు పిచ్చితో రాష్ట్రంలో ఉన్న మధ్యతరగతి కుటుంబాల జీవితాలతో ఆడుకున్నారు. వ్యాపారా లు లేవు, పరిశ్రమలు లేవు. సంక్షేమానికి పెద్దపీట వేశానని చెప్పుకుంటున్న జగన్‌… సంక్షేమం పేరుతో అప్పు చేసిన 9.55 లక్షల కోట్లు ఎవరి జేబులోకి వెళ్లాయో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం పేదలకు ఇచ్చే బియ్యం సైతం పక్కదారి పట్టించావ్‌. ప్రతి వ్యవస్థను అవినీతి మయం చేశారు. విద్యుత్‌ చార్జీలు పెంచనని చెప్పి 11 సార్లు పెంచారు. నాసిరకం బ్రాండ్స్‌ మద్యంతో పేదల జీవితాలతో ఆడుకున్నారు. మళ్లీ కూటమి అధికారంలోకి వస్తుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపేందుకు పనిచేస్తుందని తెలిపారు. పరిపాలనని గాడిలో పెట్టేందుకు ప్రజలు కూటమిని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.