Mahanaadu-Logo-PNG-Large

గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ కు తొలిసారి భారీ విమానం

-అంతర్జాతీయ హోదా తర్వాత ఎయిర్‌ బస్‌ 340 రాక
-ఘనస్వాగతం పలికిన విమానాశ్రయ అధికారులు

అమరావతి, మహానాడు: విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్‌ బస్‌ 340 ఎయిర్‌ క్రాఫ్ట్‌ మొదటిసారి వచ్చింది. హజ్‌ యాత్రికులను తీసుకెళ్లేందుకు లెజెండ్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం ఇక్కడకు చేరుకుంది. పెద్ద విమానానికి సెరిమోనియల్‌ వాటర్‌ కానన్‌ సలైట్‌లో విమానాశ్రయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అంతర్జాతీయ హోదా వచ్చిన తర్వాత భారీ విమానాల రాకపో కలు వీలవుతుందని వినడమే కానీ, ఎప్పుడూ చూడలేదని స్థానికులు పేర్కొన్నారు. పెద్ద పక్షిలా భారీ శబ్దంతో రాకపోకలు సాగించిన ఈ విమానాన్ని చూసేందుకు ఆసక్తి కనబరిచారు. సాధారణ విమానంలో 200 మంది ప్రయాణం చేస్తారు. కానీ ఎయిర్‌బస్‌ 340 ఎయిర్‌ క్రాఫ్ట్‌లో సుమారు 300 నుంచి 350 మంది ప్రయాణం చేయవచ్చు.