Mahanaadu-Logo-PNG-Large

మెగా డీఎస్సీపై తొలి సంతకం

-ఏపీలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
-చంద్రబాబు ప్రమాణస్వీకారంలో ప్రకటనకు సిద్ధం

అమరావతి: రాష్ట్రంలో 39,008 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జూలైలో లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడిరచింది. 2023 జూలై 31న లోక్‌సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి ఈ సమాధానమిచ్చారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2022-23లో 39,008, 2021-22లో 38,191, 2020-21లో 22,609 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆ సందర్భంగా వివరించా రు. దీంతో ఎన్నికల్లో మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతామని ప్రకటించిన చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండటంతో విద్యా శాఖ అందుకు సంబంధించిన ఖాళీల వివరాలతో అప్రమత్తమైంది. ఇప్పటికే ఖాళీ పోస్టుల వివరాలు పంపాలని సంబంధిత అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. మూడునెలల క్రితం విడుదలైన నోటిఫికేషన్‌లో 6,100 పోస్టులు ఉన్నాయి. అయితే తాజాగా 30 వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.