సర్వేపల్లి నియోజకవర్గంలో వైసీపీని వీడుతున్న శ్రేణులు
సోమిరెడ్డి సమక్షంలో టీడీపీలోకి వలసలు
సర్వేపల్లి, మహానాడు : ఐదేళ్లు నియోజకవర్గంలో అరాచకాలు చాలు…ఇక మేం భరించలేమంటూ సర్వేపల్లి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీని వీడుతున్నారు. వెంకటాచలం, ముత్తుకూరు, పొదలకూరు మండలంలో ఆయన అక్రమాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయ ని దుయ్యబడుతున్నారు. తమకే ఆ పార్టీలో ఉండటం సిగ్గుగా ఉందని అంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాయకత్వంలోనే సర్వేపల్లి నియోజకవర్గం అభివృద్ధి జరుగు తుందనే అభిప్రాయంతో ఆయన సమక్షంలో టీడీపీలో చేరుతున్నారు. గురువారం నెల్లూరు వేదాయపాళెంలోని సోమిరెడ్డి కార్యాలయంలో వెంకటాచలం మండలం అనికేపల్లి పంచా యతీ గొలగమూడి ఎస్సీ కాలనీకి చెందిన 13 కుటుంబాలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో తాళ్లూరు వెంకట రమణయ్య, దారా రవి, దారా రామయ్య, పాళెపు చినరమణయ్య, తాల్లూరు చినరమణయ్య, కమతం రమేష్, ఆసాది బుజ్జి, బాణాల మస్తాన్, దారా వెంకటేష్ తదితరులు ఉన్నారు.