శ్రీశైలం జలాశయానికి పోటెత్తిన వరద

పై నుంచి వరద పోటెత్తుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ 10 గేట్లు అధికారులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3,09,600 క్యూసెక్కులు కాగా, ఔట్‌ ఫ్లో 5,18,539 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుత నీటిమట్టం 883.80 అడుగులు ఉంది.

నిండుతున్న నాగార్జునసాగర్‌
శ్రీశైలం నుంచి నీరు వదలడంతో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌లోకి వరద పెరిగింది. ఇన్‌ ఫ్లో 4,91,602 క్యూసెక్కులు కాగా ఔట్‌ ఫ్లో 30,886 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు.. ప్రస్తుత నీటిమట్టం 545.20 అడుగులు వద్ద ఉంది.