Mahanaadu-Logo-PNG-Large

ప్రభుత్వం ఏర్పాటు చేయండి బాబూ: గవర్నర్‌ పిలుపు

అమరావతి: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఎన్డీఎ కూటమి నేత చంద్రబాబునాయుడిను రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆహ్వానించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం చంద్రబాబు రాజ్‌ భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా తనకు మద్దతు ఇచ్చిన 163 మంది ఎమ్మెల్యేల జాబి తాను గవర్నర్‌కు అందజేశారు. అలాగే మంత్రి వర్గ ఏర్పాటు వివరాలపై గవర్నర్‌తో చర్చించారు. ఇక బుధవారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించనున్నారు. అందుకు ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. అయితే వాటిని పరిశీలించేందుకు రావాలని గవర్నర్‌కు విజ్జప్తి చేశారు.