ఏఐసీసీ ఇన్‌చార్జ్ సమక్షంలో చేరిక
హైదరాబాద్, మహానాడు : గాంధీభవన్‌లో ఏఐసీసీ ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బుధవారం మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు చేరిన వారిలో డాక్టర్ వెన్నెల అశోక్, సంచార జాతుల కులాలకు చెందిన ముఖ్య నాయకులు ఉన్నారు. వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు సంగిశెట్టి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.