మాజీ ఎమ్మెల్యే పార్వతమ్మ ఆరోగ్యం విషమం!

నెల్లూరు, మహానాడు: కాంగ్రెస్ పార్టీ దివంగత నేత, మాజీ ఎంపీ, ప్రముఖ పారిశ్రామికవేత్త మాగుంట సుబ్బరామిరెడ్డి భార్య పార్వతమ్మ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆదివారం రాత్రి ఆమెను చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. కొద్ది రోజుల కిందట పార్వతమ్మ కుమారుడు మాగుంట విజయ్ రెడ్డి మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం చెన్నై తరలించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కి పార్వతమ్మ వదిన. పార్వతమ్మ పార్లమెంటు సభ్యురాలుగా, ఎమ్మెల్యే గా పలు హోదాల్లో ప్రజలకు సేవ చేశారు.