-రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేట్ లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ కి భూమిపూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిరుద్యోగుల ఆశలు నెరవేర్చడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఇందిరమ్మ రాజ్యం యంగ్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నది.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో యువతీ యువకుల జీవితాలు అద్భుతంగా ఉండాలని గత పాలనలో ఆశించాం. నిరుద్యోగ యువత భవిష్యత్తు పునాదుల గురించి గత బిఆర్ఎస్ సర్కార్ ఇలాంటి ఆలోచన చేయలేదు.
యువతీ యువకుల ఆశలు నెరవేర్చాలని, నిరుద్యోగ యువతీ యువకుల భవిష్యత్తు పునాదులు వేయడానికి ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నది.
ప్రపంచంతో పోటీపడే విధంగా ప్రపంచంలో ఎక్కడికెళ్ళిన ఉద్యోగ అవకాశాలు దొరికే విధంగా నిరుద్యోగ యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఇస్తుంది.
అధికారంలోకి వచ్చిన వెంటనే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను ఒక దగ్గరకు పోగేసి పరిశ్రమలకు అవసరమయ్యే కోర్సులు ఏమి కావాలో తెలుసుకొని వాటిని తయారు చేయడానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నీ ఏర్పాటు చేసుకోవడం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నే ఈరోజు సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.
గత ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఫార్మసిటి పేరిట రైతుల నుంచి గుంజుకున్న భూములను అమ్ముకోవాలని చూసింది. ఫార్మాసిటీతో విపరీతమైన కాలుష్యాన్ని తీసుకొచ్చి, ఇక్కడ జనజీవన పరిస్థితులు కాలుష్యమైన, ప్రజల జీవితాలు ఏమైనా పర్వాలేదని కాలుష్య పరిశ్రమలకు భూములు అమ్ముకోవాలని గత బిఆర్ఎస్ ప్రభుత్వం భావించింది.
ఈ ప్రాంతంలో భూములు కోల్పోయినది మన బిడ్డలే.. వారికి విసిరేసిన విధంగా అక్కడక్కడ ప్లాట్లు ఉండకూడదని, వాళ్ళ జీవితాల్లో వెలుగులో నింపి, అభివృద్ధి చేయాలని భావించిన ప్రజా ప్రభుత్వం 600 ఎకరాల్లో అద్భుతమైన కమ్యూనిటీ నగరాన్ని కట్టాలని ఈ రోజు భూమి పూజ చేశాం. హైదరాబాద్ సికింద్రాబాద్, సైబరాబాద్ ను తలదన్నే విధంగా నాలుగో నగరంగా అద్భుతంగా ఈ ప్రాంతాన్ని హైదరాబాదుకు తలమానికంగా అభివృద్ధి చేస్తాం
దేశంలో నుండి ఇక్కడికి వచ్చి నివాసం ఉంటే చాలు అదే అదృష్టంగా భావించే విధంగా అద్భుతమైన నగరంగా ఆవిష్కరించబోతున్నాం. రాష్ట్రంలో ఇల్లు కట్టుకోలేని పేదలు, నిరుపేదలు బడుగు బలహీన వర్గాల కోసం కూడా ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తున్నాం.