కూటమి నాయకులు, కార్యకర్తలతో సందడి
హామీలు అమలుచేస్తానని ప్రజలకు భరోసా
వినుకొండ: ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు నివాసం దగ్గర శుక్రవారం నాయకు లు, కార్యకర్తలు, అభిమానులతో కోలాహలం నెలకొంది. 30,276 ఓట్ల అఖండ మెజారిటీతో గెలుపొందిన తమ నాయకుడిని కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి తరలివస్తున్నారు. దీంతో స్థానిక కొత్తపేటలోని జీవీ నివాసం దగ్గర మూడురోజులుగా పండుగ వాతావరణం నెల కొంది. ప్రజలకు జీవీ అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతా నని తెలిపారు. ఇచ్చిన హామీలను తప్పనిసరిగా నెరవేరుస్తానని చెప్పారు. విను కొండ పట్టణానికి శాశ్వత తాగునీటి పరిష్కారం, నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో వాటర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందజేయడం, వరికపొ డిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తానని తెలిపారు.