గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి
గుంటూరు: జగన్ రెడ్డి ప్రవేశపెట్టింది నవరత్నాలు కావని ‘‘గులక రాళ్లు’’ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి ఎద్దేవా చేశారు. మంగళవారం 33వ డివిజన్ లక్ష్మీపురంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జ్యోత్స్నతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మమేకమవుతూ ముందు కుసాగారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం టీడీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.