తెనాలి: గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రెండురోజుల క్రితం తనను కలిసిన పోలీసులకు గంజాయిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ను కోరారు. దాంతో నిఘా పెట్టిన పోలీసులు గంజాయి విక్రయిస్తున్న బాలాజీరావుపేటకు చెందిన ఎనిమిది మందినిని అరెస్టు చేశారు. వారి దగ్గర రూ.40 వేల విలువైన రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. త్రీటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.