గేట్ల నిపుణులు కన్నయ్యనాయుడుకు రైతు సంఘాల ఘన స్వాగతం

విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ కి ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 11 లక్షల ఫ్లడ్ రావటం దానిమీద ప్రకాశం బ్యారేజీ శాండ్ బోట్లు కొట్టుకు వచ్చి 69వ గేటు డ్యామేజ్ అవ్వడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఇటీవల ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన గేట్ల నిపుణులు, ఎన్.కన్నయ్య నాయుడు రాత్రి ఇండిగో విమానంలో విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు.

వారికి రాష్ట్ర సాగునీటి వినియోగదారు సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణరావు విజయ డైరీ డైరెక్టర్, కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహ కార్యదర్శి గుండపనేని ఉమా వరప్రసాద్, కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పామాయిల్ ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు బొబ్బా వీరరాఘవరావు తదితరులు కన్నయ్యనాయుడు కి ఎయిర్పోర్ట్ లో దుశ్శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ సందర్భంగా కన్నయ్య నాయుడు మాట్లాడుతూ.. స్టాప్ లాగ్ గేట్ తో ఎంతోమంది రైతులకు సహాయం చేశారని ప్రకాశం బ్యారేజ్ గేటు సమస్యను కూడా త్వరలోనే పరిష్కరించి 13 లక్షల ఎకరాల్లో ఉన్నటువంటి ఆయకట్టును కూడా కాపాడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరులశాఖ చీఫ్ ఇంజనీర్ తోట రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.