పెంచి పోషించిన కాంగ్రెస్‌పైనే అరుణమ్మ పగబట్టింది
ఆమెను గెలిపిస్తే మాజీ ఎమ్మెల్యే ఇసుక దోపిడీ ఖాయం
కేసీఆర్ ధన దాహానికి నిదర్శనం పాలమూరు ఎత్తిపోతల
మక్తల్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
మక్తల్, మహానాడు : తెలంగాణ పౌరుషాన్ని, పాలమూరు పౌరుషాన్ని మోదీకి రుచి చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మక్తల్ జన జాతర సభలో ఆయన ప్రసంగించారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తోంది. మతాల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోంది. యూపీలో ఎంతో మంది రాజకీయ ఉద్దండులు ఉన్నా అక్కడకు పెట్టుబడులు ఎందుకు రావడంలేదు? ఇందుకు మత కలహాలు కారణం కాదా? బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రం వందేళ్లు వెనక్కు వెళుతుందన్నారు. తెలంగాణలో 68 శాతం కృష్ణా నదీ జలాలు ఉంటే అందులో 52 శాతం ఈ ప్రాంతం నుంచే వస్తాయి. కళ్ల ముందు కృష్ణమ్మ బిరాబిరా తరలిపోతున్నా కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి ఇక్కడి ప్రజలది. పదేళ్ల కేసీఆర్ పాలనలో పాలమూరు ఎత్తిపోతల పూర్తి కాలేదు. జూరాల సామర్ధ్యం పెంచలేదు. మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పూర్తి కాలేదు. పాలమూరు ఎత్తిపో తలను కేసీఆర్ తన ధన దాహానికి ఉపయోగించుకున్నారు తప్ప ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు.
అరుణమ్మ ఓడితే నష్టమేం లేదు…
ఢల్లీి నుంచి మోదీ మనపై దండయాత్రకు బయలుదేరారు. మన ఇంటి దొంగలు ఆయనకు మద్దతుగా ఇక్కడ కత్తి పట్టుకుని తిరుగుతున్నారు. కాంగ్రెస్‌ను ఓడిరచాలని కుట్రలు చేస్తున్నా రు. అరుణమ్మ ఒక్కసారి ఎంపీ కాకుంటే తెలంగాణకు వచ్చే నష్టం లేదు.. పాలమూరుకు వచ్చే కష్టం లేదు..కానీ, ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే పాలమూరు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది.. అరుణమ్మ గెలిస్తే మీ మాజీ ఎమ్మెల్యే మళ్లీ ఊర్ల మీద పడతాడు. ఇసుక దోపిడీకి పాల్పడుతాడు. మంత్రిని చేసిన కాంగ్రెస్‌ను అరుణమ్మ ఓడిరచాలని పగపట్టింది. మీరు పెం చిన ఈ చెట్టును నరకాలని ఢల్లీి నుంచి గొడ్డలి పట్టుకుని బయలుదేరారు. బంగ్లా రాజకీయాల ను తిప్పికొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో మన పాలమూరు ఆత్మగౌరవాన్ని గెలిపించుకుందాం. నా చివరి రక్తపు బొట్టు వరకు పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటా. వంశీచంద్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.