Mahanaadu-Logo-PNG-Large

జనసేన పోటీ చేయని స్థానాల్లో గాజు గ్లాసును ఫ్రీజ్‌ చేయాలి

` అటువంటి చోట్ల ఆ గుర్తును ఎవరికీ కేటాయించొద్దు
` హైకోర్టు ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ తప్పుగా అర్థం చేసుకుంది
` ఓటర్లను బెదిరిస్తున్న విశాఖ మాజీ ఎంపీ,
ఉదయగిరి వైసీపీ అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలి
` అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డిని
ఎన్నికల విధుల నుంచి తప్పించాలి
` ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలి
` ఎన్నికల ప్రధానాధికారికి టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు

మంగళగిరి, మహానాడు : హైకోర్టు ఆదేశాలనుసారం జనసేన పార్టీ పోటీ చేయని స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును మరెవరికీ కేటాయిం చకుండా ఫ్రీజ్‌ చేయాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య బుధవారం అమరావతిలోని సచివా లయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనాను కలిసి ఫిర్యాదు చేశారు. గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎన్నికల కమిషన్‌ తప్పుగా అర్థం చేసుకుందన్నారు. ఓటర్లపై బెదిరింపులకు పాల్ప డుతున్న విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ, ఉదయగిరి అసెంబ్లీ అభ్యర్ధి మేకపాటి రాజగోపాల్‌ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికార వైసీపీ నాయకులకు అండగా ఉంటూ అనంతపురం ఎమ్మెల్యేకు తొత్తు లా వ్యవహరిస్తున్న డీఎప్పీ వీరరాఘవరెడ్డిని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఫిర్యాదు చేశారు. ప్రశాంత మైన వాతావరణంలో ఎన్నికలు జరిగితే వైసీపీ నాయకులు పెట్టె బేడా సర్దుకుని శంకరగిరి మాన్యాలకు పోవడం ఖాయమని స్పష్టం చేశారు.

గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్‌ చేయాలి…
జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఎన్నికల సంఘం తప్పుగా అర్థం చేసుకుంది. ఎక్కడైతే జనసేన పార్టీ పార్లమెంటుకు పోటీ చేస్తుందో ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఒక పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానంలో అయినా జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్లయితే మిగిలిన ఆరు స్థానాలతో పాటు పార్లమెంటుకు పోటీ చేస్తున్న అభ్యర్ధులకు కూడా గాజు గ్లాసు గుర్తు కేటాయించకూడదని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం కోర్టు ఆదేశాలను తప్పుగా అర్థం చేసుకుని జనసేన పోటీ చేయని ఏ స్థానంలో అయినా గాజు గ్లాసు గుర్తును ఎవరైనా కోరితే ఇస్తామని ఎన్నికల కమిషన్‌ చెబు తోంది. ఈ విధానం సరైనది కాదు. మా అభ్యర్ధనలను ఎన్నికల కమిషన్‌ అర్థం చేసుకోవడం లేదు. కూటమి విజయాన్ని ఆపాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో మేము కోర్టుకు వెళ్లాల్సి వస్తోంది.

పోలీసు అధికారిగా డీఎస్పీ వీరరాఘవరెడ్డి అనర్హుడు…
అనంతపురంలో పనిచేస్తున్న డీఎస్పీ జి.వీర రాఘవరెడ్డి అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మల్యేకు బంధువవ్వడంతో వైసీపీకి ఓటు వేయండని బహిరంగంగా ప్రచారాలు చేస్తు న్నారు. ఈ రకంగా డీఎస్పీ వ్యవహరిస్తుంటే స్థానిక ఎన్నికల అధికారులు ఏమి చేస్తున్నారో తెలయడం లేదు. అతను పోలీసు అధికారిగా ఉండడానికి అనర్హుడు. ఎన్నికల విధుల్లో అతను ఉండకుండా తక్షణమే అతన్ని బదిలీ చేయాలి.

వైసీపీ నాయకులపై కేసు నమోదు చేయాలి…
విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ నోటికి అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. ఏదో రకంగా తిరిగి అధికారంలోకి రావాలని అసత్య ప్రచారాలు చేస్తున్నాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరైనా తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే ఊరినుంచి బహిష్కరి స్తామంటూ మేకపాటి రాజగోపాల్‌రెడ్డి ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. అతనిపై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటువంటి పనికిరాని చెత్తంతా వైసీపీలోనే ఉంది. ఓటర్లపై బెది రింపులకు పాల్పడుతున్న వారిని అరెస్ట్‌ చేసి ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం.

వైసీపీ మ్యానిఫెస్టోను ప్రజలు నమ్మడం లేదు…
వైసీపీ నాయకులు ఎన్ని అడ్డ దారులు తొక్కినా ప్రజలు వారి మాయలో పడడం లేదు. ఎన్డీఏ కూటమిని ప్రజలు కోరుకుంటున్నారు. ఐదేళ్ల జగన్‌ అబద్ధపు పాలనకు చరమగీతం పాడేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇకనైనా జగన్‌ రెడ్డి పద్ధతిని మార్చుకుని ధైర్యంగా ప్రజాక్షేత్రంలో మాతో తలపడాలి. కూటమి మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలు అభినందించారు. వైసీపీ మ్యానిఫెస్టోను ఎవ్వరూ నమ్మడం లేదన్నారు.