– తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ అధికారులకు కేంద్రం ఆదేశం
న్యూఢిల్లీ: తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారులు వెంటనే స్వరాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా ఐఏఎస్ అధికారుల పేరిట లేఖలను రాస్తూ వాటి కాపీలను రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కేంద్రం మొన్న పంపించింది. వాకాటి కరుణ(ఐఏఎస్, 2004), రోనాల్డ్ రాస్(ఐఏఎస్, 2006), వాణీప్రసాద్(ఐఏఎస్, 1995), ఆమ్రపాలి కాట(ఐఏఎస్, 2010), ప్రశాంతి(నవంబర్ రిటైర్, 2009), అంజన్ కుమార్(ఐపీఎస్, 1990), అభిలాష బిస్త్(ఐపీఎస్, 1994), అభిషేక్ మహంతి( ఐపీఎస్, 2011)లకు లేఖలు కేంద్రం పంపించింది.