వివేకా హంతకులకే శిక్ష పడలేదు..ప్రజల సంగతేంటి?
ఆ రోజే ఆయన మాట వింటే ఈ ఘోరం జరిగేది కాదు
ప్రొద్దుటూరు బహిరంగ సభలో వై.ఎస్.షర్మిలారెడ్డి
ప్రొద్దుటూరు, మహానాడు : కడప జిల్లా ప్రొద్దుటూరులో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించారు. గొడ్డలి అవినాష్ రెడ్డి కావాలా? కొంగిచాపి న్యాయం అడుగుతున్న వైఎస్ బిడ్డ కావాలా? అని ప్రశ్నించారు. కడప ప్రజలు న్యాయం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ తమ్ముడు వివేకాను చంపిన నిందితులకే శిక్ష పడలేదు అంటే…ఇక రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. ఆనాడే నేను వివేకా మాట విని ఉంటే ఈ ఘోరం జరిగి ఉండేది కాదన్నారు. ప్రజా కోర్టులో న్యాయం కోసం జరుగుతున్న పోరాటమే కడప ఎన్నికలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ..హంతకుడిని కాపాడుతుంటే ఇక ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. సీఎం అలా ఉంటే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సైతం గొడ్డళ్లుపట్టుకుని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు.
ప్రొద్దుటూరు అభ్యర్థి అడ్డొస్తే గొడ్డలితో వేస్తాడట…
పొద్దుటూరు వైసీపీ అభ్యర్థి బాగా సంపాదించాడట. యధేచ్చగా బెట్టింగ్‌లు..గుట్కా,మట్కా వ్యాపారం.. దొంగనోట్ల బిజినెస్..మూడు పువ్వులు..ఆరుకాయలుగా దోపిడీలు. దోచుకున్న డబ్బు మొత్తం మీదే.. ఎంత ఇచ్చినా తీసుకోండి. ఆలోచన చేసి ఈసారి ఓటు వేయాలని కోరారు. దోచుకునే వారు ఎవరు? పనిచేసే వారు ఎవరు? అని నిర్ణయించుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు అభ్యర్థి అడ్డొస్తే ఎవరినైనా గొడ్డలితో నరుకు తాడట. మళ్లీ మళ్లీ ఇలాంటి నేరస్థులను చట్టసభలకు పంపుదామా అని ప్రశ్నించారు.