గాయని జొన్నలగడ్డ మాధవికి బంగారు పతకం

ప్రదానం చేసిన గణపతి సచ్చిదానందస్వామి
ధర్మ ప్రచార సేవలపై ప్రశంసలు

మచిలీపట్నం : మధుర గాయని, లక్ష్మీ పురస్కార గ్రహీత, జొన్నలగడ్డ మాధవికి భగవద్గీత పఠనంపై చేస్తున్న సేవలను గుర్తించి మైసూరు గణపతి సచ్చిదానంద స్వామి బంగారు పతకం, ప్రశంసా పత్రం అందచేశారు. మైసూరు ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో మాధవితో పాటు సిహెచ్‌.శ్రీదేవి తదితరులను సత్కరిం చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచారిణిగా ఉంటూ పలు దేవాల యాలు, పాఠశాలల్లో భగవద్గీత శ్లోకాలపై మాధవి ఉపన్యాసాలు ఇస్తున్నారు. విద్యార్థులకు రామాయణ, మహాభారత, మహా భాగవత కథలను వినిపిస్తున్నా రు. ధార్మిక, ఆధ్యాత్మిక అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. బంగారు పతకం అందుకున్న సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మప్రచార పరిషత్‌ సేవకులు తుర్లపాటి ప్రసాద్‌తో పాటు వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.