సైకో ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చింది

– ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ 

తాడికొండ, మహానాడు: సైకో  ప్రభుత్వం పోయి సైకిల్ ప్రభుత్వం వచ్చిందని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా తాడికొండ గ్రామంలోని కొండపై వేంచేసియున్న గంగా భ్రమరాంబ సమేత కొండ మల్లికార్జున స్వామిని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితుల చేతుల మీదగా 10,116 కొబ్బరికాయల నీళ్లతో అభిషేకం వైభవోపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎడ్డూరి హనుమంతరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.