నిరుద్యోగులకు శుభవార్త!

– 22న మెగా జాబ్‌ మేళా

సత్తెనపల్లి, మహానాడు: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నన్ను నిరుద్యోగ యువత కలిసి వారి నిరుద్యోగ సమస్యను చెప్పుకున్నారు.. ఆ రోజున వారందరికీ మన ప్రభుత్వం అధికారం లోకి రాగానే నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తాను అని హామీ ఇచ్చానని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే… నేను ఇచ్చిన హామీకి అనుగుణంగా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల లోనే నేను స్వయంగా కంపెనీల తో చర్చించి వారిని నియోజక వర్గానికి తీసుకొని వస్తా. ఈ నెల 22వ తేదీ, ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు సత్తెనపల్లి లోని ప్రజావేదిక లో మెగా జాబ్ మేళ జరుగుతుంది. నియోజక వర్గం లోని నిరుద్యోగ యువత ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి.