ఆర్టీసీకి గవర్నెన్స్ నౌ 9th పీఎస్‌యూ ఐటీ అవార్డు బాధ్యత పెంచింది

– రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందిస్తాం
– మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి

విజయవాడ, మహానాడు: గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు రావడంపై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. “యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ సౌలభ్యాన్ని ప్రవేశ పెట్టడం, ఇన్ బస్సు లో డిజిటల్ టికెట్లు జారీ చేయడం, సంస్థ అన్ని బస్సుల్లో ట్రాకింగ్ సిస్టం ను ఏర్పాటు చేయడం ద్వారా సంస్థ ఈ అవార్డును అందుకున్నదని తెలిపారు.

సాంకేతికతను వినియోగించుకుని ప్రయాణికులకు భద్రతమైన, సుఖమయమైన ప్రయాణం అందించేందుకు కృషి చేస్తామని, రానున్న రోజులలో ప్రజలను మరింత మెరుగైన సేవలు అందిస్తామని మంత్రి తెలిపారు. ఢిల్లీ లో హోటల్ హాలిడే ఇన్ లో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో సంస్థ యాజమాన్యం ఈ అవార్డును అందుకున్నట్టు మంత్రి విజయవాడలో మీడియాకు తెలిపారు.