వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీం పొడిగింపునకు ప్రభుత్వం ఆమోదం

-వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపించిన సమాచార శాఖ
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పంపిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఆమోద ముద్ర
-జర్నలిస్ట్ హెల్త్ స్కీం ద్వారా 11,200 మంది జర్నలిస్టులకూ, 34 వేల మంది కుటుంబ సభ్యులకూ లబ్ధి
-వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
-జర్నలిస్టు కుటుంబాల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది
-మంత్రి సత్యకుమార్ యాదవ్

ఇటీవల ఏపీ ఎంపీ ఏ చేసిన విజ్ఞప్తి మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ వర్కింగ్ జర్నలిస్టుల హెల్త్ స్కీమ్ ను పొడిగించడం పట్ల ఏపీ ఎంపీ ఏ రాష్ట్ర నాయకత్వం హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఈ సందర్భంగా ఏపీ ఎంపీ ఏ రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కొత్తగా ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం నెలరోజుల్లోపే చర్యలు తీసుకోవడం హర్షనీయమని, అభినందనీయమని అన్నారు.