– ‘ప్రజాదర్బార్’ లో ఎమ్మెల్యే కన్నా
సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్ర ప్రజల కోసం కూటమి ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, వినతులు స్వీకరించారు. పట్టణంలోని 24వ వార్డలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన ఏమన్నారంటే.. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. అందరి క్షేమం కోరే మనసున్న మంచి ప్రభుత్వం మాది. ప్రజా ప్రభుత్వం ప్రతి ఒక్కరికి అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దు. పట్టణంలో వివిధ సమస్యలతో బాధపడుతున్న వారు కన్నాని కలిసి తమ సమస్యలు విన్నవించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.