తీర‌ప్రాంత అభివృద్దికి,ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంది

-పారిశ్రామిక కారిడార్ లు,పోర్టుల‌తో రాష్ట్రంలో తీర‌ప్రాంతంలో అభివృద్ది వేగ‌వంతం
-వాతావ‌ర‌ణ మార్పులు,ప్ర‌కృతి వైప‌రీత్యాల‌తో తీర‌ప్రాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది
-ప‌ర్యావ‌ర‌ణ ప్ర‌భావిత అంశాల‌కు ఆర్కిటెక్ట్ లు,ప్లాన‌ర్ లు ప‌రిష్కారం చూపించాలి
-స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్ నిర్వ‌హించిన జాతీయ స‌ద‌స్సులో మంత్రి పొంగూరు నారాయ‌ణ‌

రాష్ట్రంలో తీర‌ప్రాంత అభివృద్ది,ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ అంశంలో ప్ర‌భుత్వం నిబ‌ద్ద‌త‌తో ప‌నిచేస్తుంద‌ని పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ అన్నారు.ఇండియ‌న్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టౌన్ ప్లాన‌ర్స్ తో క‌లిసి విజ‌య‌వాడ‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్ రెండు రోజుల జాతీయ స‌ద‌స్సు నిర్వ‌హిస్తుంది…టెక్నో ట్రెడిష‌న‌ల్ ఇండియ‌న్ నాలెడ్జ్ సిస్ట‌మ్స్ ఫ‌ర్ ఎకో సెన్సిటివ్ కోస్ట‌ల్ సెటిల్ మెంట్ ప్లానింగ్ (సాంకేతిక‌,పాంప్ర‌దాయ జ్ణానాన్ని ఉప‌యోగించ‌డం ద్వారా తీర‌ప్రాంత ప‌ర్యావ‌ర‌ణ ర‌క్ష‌ణ) అనే అంశంపై ఈ స‌ద‌స్సు జ‌రుగుతుంది..రెండు రోజుల పాటు జ‌రుగుతున్న ఈ స‌ద‌స్సు ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర పుర‌పాల‌క మరియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ హాజ‌ర‌య్యారు.

తీర‌ప్రాంతంలో నెల‌కొంటున్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల‌కు అనుగుణంగా తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల‌పై ఈ స‌ద‌స్సులో ప్ర‌ధానంగా చ‌ర్చించనున్నారు. దేశంలోని ప‌లు ప్రాంతాల నుంచి నిపుణులైన ఆర్కిటెక్ట్ లు,ప్లాన‌ర్ల‌తో పాటు విజ‌యవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చ‌ర్ విద్యార్ధులు ఈ స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు.

రాష్ట్రంలో తీర‌ప్రాంత అభివృద్ది,ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లు,ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను మంత్రి నారాయ‌ణ ఈ స‌ద‌స్సు ద్వారా వివ‌రించారు..ఆయా స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు ఇలాంటి స‌ద‌స్సు నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు మంత్రి. దేశంలోనే అత్య‌ధికంగా 972 కిమీ మేర తీర‌ప్రాంతం క‌లిగిన రాష్ట్రంగా ఏపీ ఉంద‌న్నారు. ఇలాంటి స‌ద‌స్సులో చ‌ర్చించే అంశాలు ఏపీకి ఎంతో ఉప‌యోగ‌క‌రం అన్నారు. ప్ర‌స్తుత వాతావ‌ర‌ణ మార్పుల యుగంలో తీర‌ప్రాంతంలో అనేక స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయ‌ని అన్నారు.

రాష్ట్రంలోని తీర‌ప్రాంతంలో 13 జిల్లాల‌తో పాటు 34.19 మిలియ‌న్ల జ‌నాభా క‌లిగి విశాఖ‌ప‌ట్నం,కాకినాడ‌,శ్రీకాకుళం వంటి అనేక ప్ర‌ధాన న‌గ‌రాలున్నాయ‌ని చెప్పారు..ఆయా న‌గ‌రాల ద్వారా విశాఖ ప‌ట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్,విశాఖ‌ప‌ట్నం – కాకినాడ పెట్రోలియం అండ్ ప్రెట్రో కెమిక‌ల్స్ ఇన్వెస్ట్ మెంట్ రీజియ‌న్ ఉన్నాయి.ఇక శ్రీసిటీలో భాగ‌మైన విశాఖ‌ప‌ట్నం, కాకినాడ‌, మ‌చిలీప‌ట్నం, రామాయ‌ప‌ట్నం, కృష్ణ ప‌ట్నం పోర్టుల‌ను కూడా అభివృద్ది చేసిన‌ట్లు చెప్పారు.తీర‌ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ది చేసేలా ప్ర‌భుత్వం ముందుకెళ్తుంద‌న్నారు.

తీర‌ప్రాంతంలో నివ‌సించే జ‌నాభాలో చాలామంది చేప‌లు ప‌ట్ట‌డం,వ్య‌వసాయంతో పాటు సాంప్ర‌దాయ వృత్తుల ద్వారా జీవ‌నోపాధి పొందుతున్నారు.అయితే ఇదే స‌మ‌యంలో వాతావ‌ర‌ణంలో జ‌రుగుతున్న మార్పులు,ప్ర‌కృతి వైప‌రీత్యాలు,స‌ముద్ర కోత కార‌ణంగా చాలా మేర తీర‌ప్రాంతం ప్ర‌భావితం అవుతుదంన్నారు.ఏపీలోని తీర‌ప్రాంతంలో దాదాపు 38 శాతం అంటే సుమారు 1900 చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల మేర జ‌నాభాలో గ‌ణ‌నీయంగా దీని ప్ర‌భావం క‌నిపిస్తుంద‌న్నారు మంత్రి.

ప‌ర్యావ‌ర‌ణంలో ఏర్ప‌డుతున్న మార్పుల‌తో ప్ర‌భావితం అయ్యే జ‌నాభాలో ఎక్కువ మంది చేప‌ట‌లు ప‌ట్ట‌డంతో పాటు సాంప్ర‌దాయ వృత్తుల‌పై ఆధార‌ప‌డిన వారు ఉన్నారు…అటువంటి వారి జీవ‌నోపాధి వాతావ‌ర‌ణంలో మార్పు కార‌ణంగా ముప్పు పొంచి ఉంది…ఇలాంటి జోన్ ల‌లో నివ‌సించే ప్ర‌జ‌ల జీవ‌నోపాధిపై ప్ర‌కృతి వైప‌రీత్యాల ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంటుంది.భార‌తీయ సాంప్ర‌దాయ జ్ణానం,సాంకేతికత ఉప‌యోగించి ఇలాంటి ప్ర‌కృతి వైప‌రీత్యాలు వంటి స‌వాళ్ల‌ను అధిగ‌మించేలా స‌ద‌స్సులో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని ఆశిస్తున్నాను.

2024 కేంద్ర బ‌డ్జెట్ లో కూడా ఇలాంటి స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డం కోసం ఏపీకి కేటాయింపులు చేయ‌డం కూడా మంచి ప‌రిణామం…ఇలాంటి స‌వాళ్ల‌ను అధిగ‌మించేందుకు కేవ‌లం నిపుణులు,ప్ర‌భుత్వ అధికారులు మాత్ర‌మే కాకుండా ఆర్కిటెక్ట్ విద్యార్ధులు కూడా ప్ర‌ధానంగా దృష్టి పెట్టాలి..రాష్ట్ర అభివృద్దికి ఎంతో కీల‌కంగా ఉన్న తీర‌ప్రాంతం లో ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌డం ద్వారా ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంపున‌కు కూడా ఉప‌యోగ‌ప‌డ‌తాయన్నారు మంత్రి..స‌ద‌స్సుకు హాజ‌రైన వారంద‌రికీ మంత్రి అభినంద‌న‌లు తెలిపారు.