Mahanaadu-Logo-PNG-Large

జగన్‌కు ఆర్థిక రంగంలో ఒనమాలు కూడా రావు

-రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారు
-వచ్చే ఆదాయం… వడ్డీ కట్టడానికి సరిపోని దుస్థితి
-రోజుకు రూ.90 కోట్లు వడ్డీ కడుతున్నాం
-బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా ప్రభుత్వం సాగుతోంది
-గాడిలో పెట్టడం చంద్రబాబు ముందున్న అతిపెద్ద సమస్య
-టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్‌కుమార్‌

మంగళగిరి: జగన్‌కు ఆర్థిక రంగంలో ఓనమాలు కూడా రావని, రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయకుమార్‌ విమర్శించారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయస్థాయిలో ఎన్డీయే, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వస్తాయని ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించిన సంస్థలు చెప్పకనే చెప్పాయి. జగన్‌ ఈ ఐదేళ్లలో డబ్బును తాయిలాలుగా పంచి ప్రజలను మభ్యపెడుతూ.. మోసం చేస్తూ వచ్చాడు. ఈ ఐదేళ్ల జగన్‌ అరాచక పాలనకు ప్రజలు సరైన తీర్పును ఇవ్వబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం చిందరవందర చేసిన ఈ రాష్ట్రాన్ని మళ్లీ ఎలా గాడిలో పెట్టాలా అనేది చంద్రబాబు ముందున్న అతి పెద్ద సమస్య. రాష్ట్రాన్ని మాత్రం సర్వనాశనం చేశా రు. వైసీపీ నాయకులు మాత్రం బాగా సంపాదించుకున్నారని ధ్వజమెత్తారు.

రాష్ట్రం చీకట్లోకి నెట్టబడింది
రాష్ట్రం మాత్రం చీకట్లోకి నెట్టబడింది. రాష్ట్రాన్ని జగన్‌ ఈ స్థాయికి ఎందుకు లాక్కొచ్చాడో తెలియదు. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని దివాలా తీయించారు. జగన్‌ ఇంటికి వెళ్లిపోయే సమయం దగ్గరపడింది. చంద్రబాబు తప్పక సీఎం అవుతారు, రాష్ట్రం బాగుపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తి కూడా సంతృప్తికరంగా లేరు. విద్యా, వైద్య రంగం కుదేలయ్యాయి. ఎడాపెడా అప్పులు తెచ్చారు. ఎక్కడా ఏ రాష్ట్రం కూడా ఇంతగా అధోగతిపాలు కాలేదు.

రాష్ట్రానికి వచ్చే ఆదాయం వడ్డీ కట్టడానికి కూడా సరిపోవట్లేదు
మనం సంపాదించుకునే ఆదాయం రూ.8,500 కోట్లు. కార్పొరేషన్‌ లోన్లు, ఆర్బీఐ ద్వారా ప్రతినెలా రూ.6 వేల కోట్లు అప్పులు చేస్తున్నాం. ఆదాయం మాత్రం జానా బెత్తడు అన్నట్లు రూ.8,500 కోట్లు మాత్రమే. దాదాపు రూ.2,700 కోట్ల పైచిలు కు వడ్డీ కడుతున్నాం. రాష్ట్ర ఆదాయం ఎంతుంతో, ఎంత వడ్డీ కడుతున్నామో ఆ వివరాలు జనాలకు తెలియడంలేదు. జగన్‌ ఆస్తులు పెంచుకున్నాడు.

అప్పుల కుప్పగా రాష్ట్రం
రాష్ట్రాన్ని జగన్‌ అప్పుల ఊబిలోకి నెట్టాడు. ఎంత సంపాదిస్తున్నామో, అంత అప్పు కడుతున్నాం. రాష్ట్రానికి ఇదేం ఖర్మ? బడ్జెట్‌ ఖర్చులు, ఆదాయాలు సరి సమానం గా లేవు. జగన్‌ పాలనలో మంచోళ్లు కూడా చెడ్డోళ్లుగా మారారు. ఈ ఏడాది మార్చిలో రూ.28,053 కోట్ల రూపాయలు వడ్డీ కట్టాము. ఇది ఒక సంవత్సరం వడ్డీనే. నెలకు దాదాపు రూ.2,400 కోట్లు.. రోజుకు మార్జినల్‌ రూ.2,666 కోట్లు వడ్డీ కట్టాము. అంటే రోజుకుి 90 కోట్ల రూపాయలు కేవలం ఆర్బీఐ అప్పుల కోసమే కడుతున్నాం. బహిరంగ మార్కెట్‌ నుంచి ఆర్బీఐ ద్వారా మనం తీసుకున్న అప్పులు అనేకం. ప్రతిరోజు మనం రూ.90 కోట్లు అప్పు కట్టక తప్పదు. కట్టకపోతే మెడమీద కత్తి పెట్టుకోవాల్సి వస్తుంది. 2022-23లో వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడి గా అప్పులు చేసింది. ఈ అప్పు రానున్న రోజుల్లో రోజుకు 90 కోట్ల నుంచి 130 కోట్లకు వెళ్లిపోయే అవకాశం ఉంది. చివరి రెండేళ్లు జగన్‌ చేసిన అప్పులు అన్నీ ఇన్నీ కావు.. కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న అప్పులు రెండు లక్షల నుంచి 3 లక్షల కోట్లు ఉన్నాయి. ఆ అప్పులకు వడ్డీ కలిపితే 130 నుంచి రూ.150 కోట్ల రూపా యలు అవుతుంది. ఈ వడ్డీ ప్రతిరోజు కట్టాల్సి ఉంది. సంపాదించేది రూ.90 కోట్లు లేదు. కానీ, రూ.90 కోట్లు రోజూ వడ్డీ కట్టాల్సి వస్తోంది.

ఈ ఐదేళ్లలో వైసీపీ సాధించిందేమీ లేదు
ఈ ఐదేళ్లలో వైసీపీ సాధించిందేమీ లేదు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2019లో రోజుకు 39 కోట్లు వడ్డీ కడుతుంటే దాన్ని మూడింతలు పెంచారు. ఆర్బీఐ ద్వారానే రూ.90 కోట్లు వడ్డీ కట్టేలా ఈ ప్రభుత్వం చేసింది. వారికి, వీరికి డబ్బులిచ్చాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశానని జగన్‌ గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఒక లక్షా 30 కోట్లు మందు బాబుల ద్వారా లాగేశారు. జీఎస్డీపీ విలువ ప్రకారం మేం చించాం, పొడిచాం అంటుంటారు. దేశంలో జీఎస్టీపీలో మనం పదవ స్థానం లో ఉన్నాం. అప్పుల్లో మిగతా దేశాలన్నీ 84 శాతం తీసుకుంటే ఆర్బీఐ ద్వారా వంద శాతం తీసుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ఒక్కటే 12 శాతం తీసుకున్నాం. రాష్ట్రం ఇచ్చిన బ్యాంక్‌ గ్యారంటీలో స్టేట్‌ ఫస్ట్‌ మనమే ఉన్నాం. 2023లో ఒక లక్షా 97 వేల 874 కోట్ల రూపాయలు తీసుకున్నాం. అప్పుల కోసం బ్యాంక్‌ గ్యారంటీ లిచ్చాం. పెట్టుబడులు తేవడంలో దేశంలో 15వ స్థానంలో ఉన్నాం. పెట్టుబడులు తేవడంలో పక్క రాష్ట్రాలతో పోల్చకుండా జార్ఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లతోనా మనం పోటీ పడాల్సింది. రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా చేశారు. జగన్‌ సంపా దన రూ.లక్షా 25 వేల కోట్ల పైచిలుకు సంపాదించారు. అంటే ప్రతి సంవత్సరం పాతిక వేల కోట్లు కేవలం మందు ద్వారానే సంపాదించారు.

వైసీపీ ప్రభుత్వం బిజినెస్‌ రూల్స్‌ పాటించలేదు
ఎస్టాబ్లిష్డ్‌ రూల్స్‌ అండ్‌ రెగ్యులేషన్స్‌ ద్వారా ప్రభుత్వాన్ని నడపాల్సి ఉంది. కానీ వైసీపీ ప్రభుత్వం బిజినెస్‌ రూల్స్‌కు వ్యతిరేకంగా వ్యవహరించింది. వైసీపీ ప్రభు త్వం అధికారంలోకి రాగానే సీఎఫ్‌ఎస్‌ఎంఎస్‌ను మూసేశారు. ఏ బిల్లు మొదటగా వస్తే ఆ బిల్లుకు మొదటగా చెల్లింపులు చేయాలని నిబంధన ఉంది. అన్ని రాష్ట్రాలు దాన్ని ఫాలో అవుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానికి వ్యతి రేకంగా వ్యవహరించింది. డబ్బులు లేకపోయినా ఈసీ వద్దకు వెళ్లి మేం ప్రజలకు డబ్బులు వేస్తాం, పర్మిషన్‌ ఇవ్వండని అడిగారు. డబ్బులు లేప్పుడు ఎందుకు ఈసీ వద్దకు వెళ్లారు? బటన్‌ నొక్కగానే పేమెంట్‌ జరగాలి. కానీ అలా జరగలేదు. ఛీఫ్‌ సెక్రటరీగా ఉండి ఈ విషక్ష్లో అబద్దాలు చెప్పారు. ఎన్నికలకు ముందు 10వ తేది ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు. ఈసీ బటన్‌ నొక్కనీయలేదు. ఒకవేళ ఈసీ అనుమతి ఇచ్చి ఉంటే బటన్‌ నొక్కి ప్రజలను మోసం చేసి ఉండేవారు. ఇన్నాళ్లు ఉత్తుత్తి బటన్లు నొక్కి జనాల్ని మోసం చేస్తూ వచ్చారు. ఆరోగ్యశ్రీ విషయంలో వంకాయ బేరాలాడారు.

ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా పంచాయతీరాజ్‌ నిధులు మొత్తం నొక్కేశారు
ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా పంచాయతీరాజ్‌ నిధులు మొత్తం నొక్కేశారు. ఆ డబ్బులు ఇప్పుడు ఎవరు కట్టాలి? ఏపీఎండీసీ నుంచి రూ.7 వేల కోట్లు స్వాహా చేశారు. కార్పొరేషన్లకు రుణాలు, గ్యారంటీలు దాదాపు రూ.90 వేల కోట్ల దాక ఉన్నాయి అవి ఎవరు కట్టాలి? మార్టిగేజ్‌, నాన్‌ గ్యారంటీ రుణాలు ఉన్నాయి. అవి కూడా రూ.90 వేల కోట్ల దాక ఉన్నాయి… వాటిని ఎవరు కట్టాలి? వివిధ కార్పొరేషన్ల నుంచి ఎస్‌ఎఫ్‌సీ డిపాజిట్లు కార్పొరేషన్‌కు కట్టించుకుని దానిలో నుంచి ఖజానాకు మళ్లించుకుని వాడేసుకున్నారు. మన పిల్లలు ఏదో సంపాదిం చుకుని దాచుకుని ఉంటే దాన్ని కూడా కొట్టేయాలనుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.