పాత నగరాన్ని పట్టించుకోని ప్రభుత్వాలు

– కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి విమర్శ

హైదరాబాద్, మహానాడు: నాంపల్లి అసెంబ్లీ, గుడిమల్కాపూర్ డివిజన్ లో ఎంపీ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ఆదివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలోనే హైదరాబాద్ అత్యంత ప్రాముఖ్యత ఉన్న నగరం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం.

హైదరాబాద్ నగరంలో మౌలిక వసతుల కల్పనకు అందరం కలిసికట్టుగా కృషిచేయాలి. నగరం నుంచే అధిక ఆదాయం వస్తున్న కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో న్యాయం జరగడం లేదు. హైటెక్ సిటీ ప్రాంత అభివృద్ధిపై చూపిస్తున్న శ్రద్ద పాత నగరం పై దృష్టి సారండం లేదు. ఈ ప్రభుత్వాలు గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం పాతనగరం అభివృద్ధిని పట్టించుకోవడం లేదు.

నగర అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళిక మాస్టర్ ప్లాన్ ను రూపొందించి అన్ని ప్రాంతాల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపి హైదరాబాద్ నగర అభివృద్ధికి నిధుల కేటాయింపులు పెంచాల్సిన అవసరం ఉంది. బస్తీల్లో రోడ్ల నిర్మాణం, పార్కుల అభివృద్ధి, మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ, వంటి అనేక మౌలిక వసతులను కల్పించాలి.