ప్రభుత్వానికి రూ. 6 కోట్ల విలువ చేసే భవనం విరాళం

తెనాలి, మహానాడు: సుమారు రూ.6 కోట్ల విలువ గల మహిళ మండలి భవనాన్ని ముద్దన కస్తూరి బాయ్‌ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ దాత కస్తూరి బాయ్ ని చెయ్యి పట్టుకొని, పూలు చల్లుతూ భవనంలోకి స్వాగతం పలికారు.

ప్రస్తుతం మహిళా మండలి అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. భవనాన్ని మంత్రి సమక్షంలోనే రిజిస్టర్ చేసి, కస్తూరి బాయ్‌ అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని పలువురు అభినందించారు.