- గ్రామాలకు కావాల్సిన సదుపాయాలపై నేడే తీర్మానం చేసుకుందా
- ఉపాధి హామీ పథకం గ్రామాలకు కల్పతరువు లాంటిది
- గ్రామ పంచాయతీల నిధులు లాక్కుని జగన్ గ్రామాలను నాశనం చేశాడు
- వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలో ఇప్పుడే జాబితా సిద్ధం చేస్తున్నాం
- సమస్యల్లేని గ్రామాలలే లక్ష్యంగా గ్రామ సభలన్న మంత్రి కొల్లు రవీంద్ర
సమస్యల్లేని గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం మండలంలోని భోగిరెడ్డిపల్లి, చిన్నాపురం, తాళ్లపాలెంలో నిర్వహించిన గ్రామ సభల్లో పాల్గొన్నారు. జగన్ రెడ్డి ఐదేళ్ల పాటు గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలేశాడని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చే ఐదేళ్లు గ్రామాల్లో ఏమేం అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని తీర్మానం చేసేలా గ్రామ సభలకు శ్రీకారం చుట్టిందన్నారు.
గాంధీజీ లక్ష్యాలకు అనుగుణంగా పాలన
రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం రికార్డు అన్నారు. గ్రామ స్వరాజ్యం కావాలని నాడు గాంధీజీ కోరుకున్నారు. నేడు గాంధీజీ లక్ష్యాన్ని సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. గ్రామాలు బాగుపడాలంటే గ్రామస్తుల్లో చైతన్యం కూడా అత్యంత అవసరం అన్నారు. అందుకే గ్రామ స్వరాజ్యం.. గ్రామ చైతన్యం లక్ష్యంగా పాలనకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. గత ఐదేళ్లలో గ్రామాల్లో ఏం అభివృద్ధి జరిగిందో.. వచ్చే ఐదేళ్లు ఏం చేయాలో జాబితా సిద్ధం చేసుకుని ముందుకు వెళదాం అన్నారు.
ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుందాం
గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకం కల్పతరువు లాంటిది. ఆ పథకం కింద కేంద్రం నుండి వచ్చే నిధుల్ని గ్రామాభివృద్ధికి వినియోగించుకోవాలి. ఇప్పటికే జిల్లాకు రూ.160 కోట్ల వరకు ఉపాధి హామీ నిధులు వచ్చాయని, వాటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలో గ్రమ సభల్లో తీర్మానించుకోవాలని సూచించారు. 2014 -19 మధ్య కాలంలో 32 శాఖల్ని ఉపాధి హామీ పథకానికి అనుసంధానించాం. దాదాపు 25 వేల కిలోమీటర్ల సిమెంటు రోడ్లు వేశాం. లక్షలాది ఎల్ఈడీ విద్యుత్ బల్బులు ఏర్పాటు చేసుకున్నాం. గ్రావెల్ రోడ్లు, స్కూల్ కాంపౌండ్ వాల్స్, అంగన్వాడీ భవనాలు సహా అనేక అభివృద్ధి పనులు ఉపాధి నిధులతోనే చేసుకున్నాం. కానీ, గత ఐదేళ్ల కాలంలో రోడ్లపై గుంతలు కూడా పూడ్చలేదు. ఎక్కడా చిన్న అభివృద్ధి జరగలేదు.అందుకే సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్న గ్రామాలను అభివృద్ధిలో పరుగులు పెట్టించడమే లక్ష్యంగా నేడు గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకుంటున్నామని అన్నారు
ప్రతి ఇంటికీ సురక్షిత నీరిచ్చే బాధ్యత తీసుకుంటా
ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని, ఆ మేరకు పనులు మొదలు పెట్టామన్నారు. మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 95శాతం పనులు పూర్తి చేశామని, త్వరలోనే గ్రామాల్లో కూడా పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద మచిలీపట్నం నియోజకవర్గంలో పనులు చేస్తున్నామన్నారు. వచ్చే ఏడాది నాటికి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. నీటి కోసం బిందెలు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.
నియోజకవర్గాన్ని దేశానికి మోడల్‌గా మారుస్తా
నియోజకవర్గంలో డ్రైనేజీలు, వీధి దీపాల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్లు ఏర్పాటుతో అభివృద్ధికి నిర్వచనం చూపుతామన్నారు. చెత్త నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యమిస్తాం. హార్టీ కల్చర్, సెరీకల్చర్, పశువుల కోసం షెడ్ల ఏర్పాటు, మినీ గోకులాలు వంటి వాటికి కేంద్రం నుండి అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం నుండి అందే తోడ్పాటును అందిపుచ్చుకోవడం ద్వారానే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుకు పెద్ద పీట వేస్తున్నాం. జగన్ రెడ్డి రూ.1000 పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకున్నాడు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం రూ.4000 పెన్షన్ అందించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకూ అమలు చేస్తూ రూ.7000 తొలి నెలలోనే అందించారు. దివ్యాంగులకు రూ.6000, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుది మాత్రమేనన్నారు. 16,800 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అమలుకు సిద్ధమయ్యాం. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. త్వరలోనే మిగిలిన పథకాలు కూడా అమలు చేసి చూపిస్తాం.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాల అమలుకు పెద్ద పీట వేస్తున్నాం. జగన్ రెడ్డి రూ.1000 పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు తీసుకున్నాడు. కానీ.. చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం రూ.4000 పెన్షన్ అందించారు. ఏప్రిల్, మే, జూన్ నెలలకూ అమలు చేస్తూ రూ.7000 తొలి నెలలోనే అందించారు. దివ్యాంగులకు రూ.6000, మంచానికే పరిమితమైన వారికి రూ.15వేలు పెన్షన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుది మాత్రమేనన్నారు. 16,800 ఉద్యోగాలతో మెగా డీఎస్సీ అమలుకు సిద్ధమయ్యాం. ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా చేసిన ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. త్వరలోనే మిగిలిన పథకాలు కూడా అమలు చేసి చూపిస్తాం.
ఎన్ని కష్టాలున్నా హామీలన్నీ అమలు చేసేందుకు కట్టుబడి పని చేస్తున్నాం. జగన్ రడ్డి ఐదేళ్ల పాలనలో ఉద్యోగాల్లేవు, ఉపాధి అవకాశాల్లేవు. కంపెనీలను తరిమేశారు. కల్తీ మద్యం తీసుకొచ్చి ప్రజల ప్రాణాలు తీశాడు. గంజాయితో యువత జీవితాలను ఛిద్రం చేశాడు. గతంలో స్కూల్ సమీపంలో మిఠాయిలు దొరికితే నేడు గంజాయి దొరికే పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాష్ట్రాన్ని అగ్రపథాన నిలుపుకునే వరకు శ్రమిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు.