మహానాడు, నరసరావుపేట: జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 148వ జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే డాక్టర్ దలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. మేదరమెట్ల అంజమ్మ మస్తాన్ రావు మహిళా కాలేజీ ఆధ్వర్యంలో వంద అడుగుల జాతీయ జెండా ర్యాలీ ఏర్పాటు చేశారు. పి.ఎస్.సీ కాలేజీ నుంచి గడియార స్తంభం వరకు ర్యాలీ నిర్వహించారు. దేశానికి పింగళి వెంకయ్య అందించిన సేవలను కొనియాడారు. బాల్యం నుంచే దేశం కోసం అడుగులు వేసిన పింగళి వెంకయ్య మన ప్రాంతం వారు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నారు.అంతటి దేశ భక్తి కలిగిన వ్యక్తి జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమంలో కాలేజ్ చైర్మన్ శేషగిరిరావు, డైరెక్టర్ శ్రావ్య, కపిలవాయి విజయకుమార్, తదితరులు పాల్గొన్నారు.