Mahanaadu-Logo-PNG-Large

ఘనంగా హర్ ఘర్ తిరంగ ర్యాలీ

గుంటూరు, మహానాడు: భారతీయ జనతా యువమోర్చా గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో స్థానిక గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్ వద్ద గాంధీ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాల వేసి అక్కడ నుంచి ర్యాలీని మొదలు పెట్టింది. యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి తుంగ యశ్వంత్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ యాత్ర లో భాగంగా సమాజంలో జాతీయ భావాల్ని పెంపొందించే దిశగా మంగళవారం జాతీయ జండా లతో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని బిజెపి సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా తూర్పు శాసనసభ్యుడు నసీర్ అహ్మద్ బైక్ ర్యాలీలో పాల్గొని వారు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత జూపూడి రంగరాజు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా దేశ మంతా జాతీయ జెండాను ప్రతి ఇంటి పైన ఆవిష్కరించు కోవాలన్నారు.

జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు యావత్ భారతదేశం అంతా స్వాతంత్ర దినోత్సవ సంబరాలను ఒక పండగలాగా చేస్తున్నారన్నారు. జాతీయ జెండాకు ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకొని స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత జెండాను జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. జోనల్ ఇంచార్జ్ ముని సుబ్రహ్మణ్యం, జిల్లా హర్ ఘర్ తిరంగా కన్వీనర్ చరక కుమార్ గౌడ్, కో కన్వీనర్స్ ఆవుల రాము, ఏలూరి లక్ష్మి, బీజేవైఎం నాయకులు బాల కోటయ్య, ఈశ్వర్, రాజా సాయి, బీజేపీ నాయకులు ఈదర శ్రీనివాసరెడ్డి, చెరుకూరి తిరుపతి రావు, పాలపాటి రవికుమార్, గంగాధర్, పద్మనాభం, దుర్గ భవాని, నాగమల్లేశ్వరి, జంధ్యాల రామ లింగ శాస్త్రి,కారం శెట్టి సత్యం, స్టాలిన్, సాంబమూర్తి, కృష్ణ చైతన్య,షేక్ బిలాల్, రామకృష్ణ, గురుదత్తు, నాగిరెడ్డి, ఉడతా నర్సింహా రావు, స్రవంతి, రావుల రాజశేఖర్, బ్రిజేష్, సురేష్ జైన్, పవన్, మనోజ్, బాబురావు, వెంకట రమణ, పలకలూరి శ్రీను, సురేష్ తదితరులు పాల్గొన్నారు.