గుంటూరు, మహానాడు: సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ జన్మదిన వేడుకలు గుంటూరు నగరంలో మంగళవారం ఘనంగా జరిగాయి. స్ధానిక నగరంపాలెంలోని కన్నా లక్ష్మీనారాయణ స్వగృహం, ఎన్డీఏ కూటమి నేతలతో సందడిగా మారింది. బండి శివరామప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 70 కేజీల కేక్ ను ఎమ్మెల్యే కన్నా కట్ చేసి పార్టీ శ్రేణులతో అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు. వారికి శాలువా కప్పి పుష్ప గుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా బండి శివరామప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కన్నా లక్ష్మీనారాయణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతో తులతుగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో తాళ్ల వెంకటేష్ యాదవ్, ఉయ్యాల శ్యాం వరప్రసాద్, పాలేటి మాధవ, నీలం ప్రసాద్, పాలిశెట్టి రఘు, బీజేపీ నేతలు పాలపాటి రవికుమార్, వెలగలేటి గంగాధర్, బబ్బూరి శ్రీరామ్, నోముల చలపతిరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.